ప్రభుత్వ ఆసుపత్రి లో 24  పడకలతో ఆధునిక ఐ సి యు మూడు కోట్ల తో ఇంటెన్సివ్ కేర్ నిర్మాణం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చేతుల మీదుగా ప్రారంబించారు .

1.

ప్రభుత్వ ఆసుపత్రి లో 24  పడకలతో ఆధునిక ఐ సి యు

మూడు కోట్ల తో ఇంటెన్సివ్ కేర్ నిర్మాణం

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చేతుల మీదుగా ప్రారంభం


రాష్ట్రం లోనే అత్యంత ఆధునిక 24  పడకలతో ఐ స్ యు ను మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య సఖ మంత్రి విడదల రజని తో ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు.

 సోమవారం నూతనంగా మూడు కోట్ల  తో నిర్మించిన ఐ సి యు ఏర్పాట్ల ను ఆయన పరిశీలించారు.

 ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితి లో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్రము లో ఎక్కడ లేని విధంగా ఐ సి యు ను మంగళవారం ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చేతుల మీదుగా ఐ సి యు ను ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, డిఎంఈ డాక్టర్ నరసింహం , జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ల ప్రత్యేక చొరవ తో ఐ సి యు ను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు.

ప్రభుత్వ ఆసుపత్రి లో జనవరి 23  వ తేదీన అద్భుతమైన రోజుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. అత్యవసర విభాగం  వందలాది మంది రోగులు వస్తున్నారని ఆయన చెప్పారు. క్యాజువాల్టీ వద్ద 600  నుంచి వెయ్యి మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారని ఆయన చెప్పారు. ఆసుపత్రికి వచ్చే వారు ఎక్కువమంది చావు బ్రతుకుల మధ్య వస్తున్నారని అలాంటి వారి కోసం ఐ సి యు ను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రాణాంతక బారిన పడిన రోగులకు వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో ఉంచామని ఆయన వివరించారు.

అత్యంత ఆధునిక పద్దతి లో తయారు చేసిన పరికరాలను  ఈ ఐ సి యు లో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ ఐ సి యు లో నిష్ణాతులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సేవలు అండీంచనున్నారని  ఆయన తెలిపారు. గత ఆరు నెలల నుంచి రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి ఐ సి యు ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.


ఒక్కొక్కటి 15  లక్షల ఖరీదు గల వెంటిలేటర్లను ఆక్సిజన్ , 24  పడకల తో ఐ సి యు ను తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్ యమ ఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ కిరణ్మయి పాల్గొన్నారు.